లేత మొక్కజొన్న గింజలు - రెండున్నర కప్పులు
పాలు - పావు లీటరు
పంచదార - ఒక కప్పు
నెయ్యి - మూడు స్పూన్లు
జీడిపప్పు,బాదంపప్పు
కిస్మిస్
చెర్రీ పళ్ళు
ఏలుకులపొడి
మొక్కజొన్న గింజలలో నీళ్ళు పోసి ఉడకపెట్టి మిక్సి లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక దళసరి గిన్నెలో నెయ్యి పోసి అందులో జీడిపప్పు,బాదంపప్పు వేయుంచుకోవాలి.
అవి దోరగ వేగాక తీసి ముక్కలు చేసి పెట్టుకోవాలి.
అదే గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజల మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డ లో వడగట్టి పాలు తీయాలి.
అందులో కాచిన పాలు, పంచదార వేసి బాగా పొంగేదాకా కలియపెడుతూ ఏలుకుల పొడి , పప్పులు వేసి దించుకోవాలి.
ఫ్రిజ్ లో పెట్టి చల్లారక తీసి చెర్రీ పళ్ళతో అలంకరించి వడ్డించాలి.
0 comments:
Post a Comment