
పాలకూర 2 కప్పులు
శనగపిండి 1 కప్పు
ఉల్లిపాయలు 200 gm
కారంపొడి 1 tsp
పసుపు చిటికెడు
వాము 1 tsp
ధనియాల పొడి 2 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించదానికి
ముందుగా పాలకూరను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఉల్లిపాయలు కూడా సన్నగా నిలువుగా తరిగి ఉంచుకోవాలి.ఒక గిన్నెలో ఉల్లిపాయలు వేసి చెతితో బాగా పిసికి అందులో పాలకూర, శనగపిండి,కారం, పసుపు,వాము,ధనియాల పొడి వేసి బాగా కలిపి కాగిన నూనెలో చిన్న చిన్న ముద్దలుగా, పొడిపొడిగా వేసి ఎర్రగా కాల్చాలి.ఇందులొ కూడా నీరు పోయనవసరం లేదు. పాలకూర,ఉల్లిపాయల తడి సరిపోతుంది.
0 comments:
Post a Comment