పూతరేకులు
బియ్యం పిండి 100 gm
పంచదార 250 gm
నెయ్యి 100 gm
ఈ పూతరేకులు చేయాలంటే చాల నేర్పు ఓర్పు కావాలి.చేయుటకు ప్రత్యేకమైన కుండఉంటుంది. బియ్యపు పిండిని కూడా నలక పడితే కనపడేటంత మెత్తగా రుబ్బాలి.కుండను బోర్లించి లొపలి భాగంలో మంట పెట్టాలి. పైభాగంలో నెయ్యి రాచి క చేతి గుడ్డంత వెడల్పుగుడ్డను పలుచగా కలిపిన పిండిలో ముంచి కాలే కుండ మీద పరిచి వెంటనే లాగాలి. అప్పుడు పలుచని రేకులాగా లేస్తుంది. వాటినే పూతరేకులంటారు. ఇంత కష్టపడేకంటేపూతరేకులు మాత్రమే దొరుకుతాయి.అవి తెచ్చుకుని నెయ్యి పంచదార వేసి చుట్టుకుంటే చాలా త్వరగా తయారవుతాయి.
పంచదారను మెత్తగ పొడి చెసి పెట్టుకోవాలి. మంచి నెయ్యి కరగపెట్టాలి. ఒక గుడ్డ రిచి రెండు రేకులు పరిచి నెయ్యి పంచదార చల్లి మడిచి చాప చుట్టాలుగా చేసి పెట్టుకోవాలి. ఇవి తినటానికి చాలా రుచిగా కరిగిపోయేలా ఉంటాయి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment