
బియ్యం 1 cup
శనగపప్పు 1/2 cup
పచ్చి కొబ్బరి 1/2 cup
యాలకుల పొడి 2 tsp
పాలు 1 కప్
బెల్లం 1 కప్
నెయ్యీ 5 tbsp
ముందుగా బియ్యం, శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మంట తగ్గించి నిదానంగా ఉడికించాలి. నెయ్యి వేడి చేసి పచ్చికొబ్బరిని తురుము దోరగా వేయించి అందులో కలిపి, యాలకుల పొడి వేసి పాలు కూడా వేసి బాగా కలుపుతూ అడుగు మాడకుండా నెమ్మదిగా దగ్గరపడేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి.కావాలంటే నెయ్యిలో వేపిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.
0 comments:
Post a Comment