పిజ్జా దోశ
కావలసినవి:-
దోశపిండి: గుంటగరిటెడు,
బియ్యప్పిండి: రెండు కప్పులు,
మైదాపిండి: కప్పు,
సెనగపిండి: అరకప్పు,
బొంబాయిరవ్వ: కప్పు,
వంటసోడా: పావుటీస్పూను,
పంచదార: పావుకప్పు,
ఉప్పు: తగినంత,
టొమాటోలు: పావుకిలో,
ఉల్లిపాయలు: పావుకిలో,
చీజ్: 100గ్రా.
తయారుచేసే విధానం:-
* చీజ్‌ను సన్నగా తరగాలి. టొమాటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి.
* ఓ గిన్నెలో పులిసిన దోశపిండి తీసుకుని అందులో అన్ని రకాల పిండుల్నీ వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. పంచదార, వంటసోడా, ఉప్పు కూడా వేసి కలిపి గంటసేపు నానబెట్టాలి.
* ఇప్పుడు ఈ పిండితో పెనంమీద ఊతప్పంలా మందంగా వేయాలి. దానిమీద సన్నగా తరిగిన టొమాటో, ఉల్లిముక్కలు వేసి తురిమిన చీజ్‌ను కూడా వేయాలి. దంచిన ఎండుమిర్చిని కూడా చల్లి మూతపెట్టి ఉడికించి తీసి వడ్డించాలి. ఇలాగే వెుత్తం పిండి వేసుకోవాలి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment