Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

Vegetable Burger


కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ పొడి - ఒక కప్పు,
క్యాబేజీ తురుము - 50 గ్రాములు,
బీన్స్ ముక్కలు - 50 గ్రాములు,
క్యారెట్ తురుము - 50గ్రాములు,
బంగాళాదుంప ముక్కలు - 50 గ్రాములు,
క్యాప్పికమ్ - పావు కప్పు,
ఎండు కారం - అర టీ స్పూను,
ధనియాల పొడి - అర టీ స్పూను,
జీలకర్ర పొడి - పావు టీ స్పూను,
గరంమసాలా పొడి - పావు టీ స్పూను,
మొక్కజొన్నపిండి - 30 గ్రాములు,
పాలు - 60 మి.లీ- బన్నులు - రెండు,
పెరుగు - ఒక టేబుల్ స్పూను,
టమోటా కెచిప్ - ఒక స్పూను,
టమోటా ముక్కలు - రెండు,
చీజ్ స్లైస్ - ఒకటి,
మెయోనేస్ - ఒక కప్పు.


తయారుచేయు విధానం:
ముందుగా కోల్‌స్లా తయారుచేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్, పావుకప్పు కాప్సికమ్‌కి ఒక కప్పు మెయోనేస్‌ని కలపాలి. దీన్నే కోల్‌స్లా అంటారు. తరువాత వెజ్ ప్యాటీస్ తయారుచేసుకోవాలి. సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఉండలుగా చేసుకుని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి.

అంతే వెజ్ ప్యాటీస్ రెడీ. మరో గిన్నెలో మొక్కజొన్న పిండి వేసి అందులో పాలు కలుపుకుని వెజ్ ప్యాటీస్‌ని రెండు వైపులా ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బన్ను తీసుకుని ముందు టమోటా కెచిప్ రాయాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల కోల్‌స్లా వేసి, దానిపైన టమోటా ముక్కలు, వెజ్ ప్యాటీస్, చీజ్ ముక్కలు, పెరుగు వేసి రెండవ బన్ పెన బోర్లిస్తే బ్రెడ్ బర్గర్ తయారయినట్టే.

0 comments:

Post a Comment