అరటి రొయ్యల కూర
కావలసిన పదార్థాలు :
రొయ్యలు... అరకిలో
అరటికాయలు... ఆరు
ఉల్లిపాయలు... రెండు
అల్లం ముక్క... చిన్నది
కారం...తగినంత
ధనియాలు... రెండు స్పూన్లు
పసుపు... కొంచెం
కొత్తిమీర... ఒకకట్ట
దాసినచెక్కలు, లవంగాలు... నాలుగు
నూనె... తాలింపుకు తగినంత
పచ్చిమిర్చి...ఆరు
ఉప్పు...తగినంత
తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. శుభ్రం చేసిన రొయ్యల్ని, పసుపునువేసి కాసేపు వేయించి అందులో అరటికాయ ముక్కలను వేసి వేయించాలి. తరువాత దీనికి ఉప్పూ కారం, తగినంత నీటిని చేర్చి ఉడికించాలి.
కూర బాగా మరిగిన తరువాత అల్లం, దాల్చినచెక్క, లవంగాలు, ధనియాలను కలపాలి. ఆపై మసాలాలన్నీ కలిపి రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని కూడా కూరలో చేర్చి కాసేపు ఉడికించాలి. చివరగా కూర ఉడికాక కొత్తిమీర చల్లి దింపేయాలి. దీన్ని వేడి వేడిగా అన్నం, దోశె, చపాతీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment