
కావలసిన పదార్ధాలు:
బంగాళదుంపలు - 2
ఉల్లిపాయలు - 2
సన్నగా తరిగిన అల్లం - 1 tsp
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1/2 tsp
పచ్చిమిరపకాయ ముక్కలు - 1 tsp
పచ్చి బఠానీలు - 1 tbsp
ధనియాలు - 1/2 tsp
నిమ్మరసం - 2 tsp
కారం పొడి - 1/2 tsp
గరం మసాలా పొడి - 1 tsp
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన కొత్తిమిర 1 tsp
కిస్‌మిస్ - 10
జీడిపప్పులు - 8
గోధుమపిండి - 250 gm
ఉప్పు - చిటికెడు
నెయ్యి లేదా నూనె - 2 tbsp
వంట సోడా - చిటికెడు
బంగాలదుంపలను మెత్తగా ఉడికించి , చేత్తో చిదిమి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, ధనియాలు, నిమ్మరసం, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమిర, కిస్‌మిస్, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి.పిండి లో ఉప్పు, వంటసోడా లేదా బేకింగ్ పౌడర్,నెయ్యి వేసి కలిపి తగినంత నీరు పోస్తూ చపాతీ పిండిలా కలిపి తడిగుడ్డ కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని కొద్దిగా నొక్కుకుని బంగాళా దుంపల మిశ్రమం ఉంచి అంచులను బాగా మూసేయాలి. దానిని కాస్త వెడల్పుగా చేసుకుని సన్నని సెగపై వేడి నూనేలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
0 comments:
Post a Comment