దోసకాయ పప్పు
కావలసిన వస్తువులు:
కందిపప్పు - 200 gms
చింతపండు పులుసు - పావు కప్పు
టొమాటోలు - 2
దోసకాయ - 1
మెంతికూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిరపకాయలు - ౩
కరివేపాకు - 1 రెబ్బ
కొత్తిమిర - 1 కట్ట
కారం పొడి - 1 tsp
పసుపు - చిటికెడు
వెల్లుల్లి - 5 పాయలు
ఉప్పు - తగినంత
నూనె - 2 tsp
తాలింపు గింజలు
ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు, పావు చెంచాడు నూనె వేసి మూట పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర, మెంతికూర, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు (చేదు చూసుకోవాలి), చింతపండు పులుసు, పసుపు,కారం, ఉప్పు వేసి కలిపి మరో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నూనె వేడి చేసి తాలింపు గింజలు, నలగగొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టి ఈ పప్పులో కలపాలి. కొద్దిగా నెయ్యి వేసి మూతపెడితే ఘుమ ఘుమలాడిపోతుంది పప్పు. ఆవకాయ లేదా అప్పడాలు నంజుకుని తినండి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment