సేమ్యా 500 gm
మంచి నూనె 150 gm
వేరుశనగపప్పు 100 gm
నిమ్మకాయలు 5
పచ్చి మిరపకాయలు 10
ఎండు మిరపకాయలు 10
పసుపు 1 tbsp
ఉప్పు తగినంత
కరివేపాకు 4 రెబ్బలు
అల్లం అంగుళం ముక్క
శనగపప్పు 3 tbsp
మినపప్పు 1 tbsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 2 tsp
ముందుగా సేమ్యాను కొలుచుకుని ఎన్ని గ్లాసులైతే అంతకు రెండింతలు గ్లాసుల నీళ్ళు ఒక పెద్ద గిన్నెలో తీసుకుని అందులో పసుపు వేసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి.నీళ్ళు బాగా పొంగు వచ్చాక కొలిచి పెట్టుకున్న సేమ్యాను వేసి పలుకుగా ఉన్నప్పుడే దించి ఒక చిల్లుల గిన్నెలో వేయాలి.వెంటనే చల్లని నీళ్ళు పోయాలి.ఇలా చేయడం వల్ల సేమ్యా విడివిడిగా అతుక్కోకుండా ఉంటాయి.తర్వాత బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఎండుమిర్చి,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేరుశనగపప్పు వరుసగా వేస్తూ దోరగా వేగిన తర్వాత ముక్కలు చేసిపెట్టుకున్న పచ్చిమిర్చి,అల్లం వేసి కొంచెం వేగగానే దించేయాలి.ఇందులో నిమ్మరసం పిండాలి.చలారిన సేమ్యాని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి ఈ పోపు మిశ్రమాన్ని వేసి అన్ని వైపులా బాగా కలియబెట్టి మూత వేసి ఉంచాలి.ఒ పది నిమిషాల తర్వాత తింటే చాలా
రుచిగా ఉంటుంది.
0 comments:
Post a Comment