లేత వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 150 gm
పల్లీలు 50 gm
నువ్వులు 50gm
జీలకర్ర 1 tbsp
మెంతులు 1/2 tsp
కొబ్బరిపొడి 100 gm
చింతపండు పులుసు 1/4 cup
నూనె 50 gm
ఉప్పు తగినంత
కారం పొడి 1 tbsp
పసుపు 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp
బెల్లం కొంచం
ముందుగా ఖాళీ బాణలిలో జీలకర్ర,మెంతులు,పల్లీలు,నువ్వులు విడివిడిగా వేయించాలి.అవి పక్కన పెట్టి అందులోనే సగం నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ఇవి అన్ని కొబ్బరిపొడితో కలిపి రుబ్బి పెట్టుకోవాలి. ఈ ముద్దలో ఉప్పు,కారం పొడి,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,చింతపండు పులుసు,బెల్లం వెసి బాగ కలిపి పెట్టుకోవాలి..వంకాయలను నాలుగు
పక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీల్లల్లో వెసి పెట్టాలి. ఈ రుబ్బిన ముద్ద వంకాయ మధ్యలొ బాగా కూరి పక్కన పెట్టుకోవాలి.తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి కాగిన తర్వాత ఈ మసాల కూరిన వంకాయలను వేసి మూత పెట్టలి.ఈ కూరను నిదానంగ చిన్న మంటపై చేయాలి.అన్ని వంకాయలు మగ్గి మెతబడిన తర్వత మిగిలిన ముద్దలో కొద్దిగా నీరు కలిపి అందులో పోసి మెల్లిగ కలిపి మూత పెట్టాలి..కూర ఉడికిన తర్వాత నూనె తేలుతుంది.కొతిమిర చల్లి దించేయడమే..ఇక గుత్తొంకాయ కూర రేడి.
0 comments:
Post a Comment