తీపి గవ్వలు
మైదా 250 gm
నెయ్యి లేదా డాల్డా 50 gm
ఉప్పు చిటికెడు
నూనె 250 gm
చక్కెర 250 gm
యాలకులు 5
ముందుగా చక్కెరలో అర గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకంలా చేసి యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి. మైదాలో కాచిన నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. గవ్వల పీటకు నూనె రాసి పెట్టుకోవాలి.మైదా పిండిని రెండుచేతులతో బాగా మర్ధన చేసి చాలా చిన్న ముద్దలుగా చేసిపెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మైదా ముద్దను గవ్వలపీటపై బొటనవేలితో వత్తుతూ సాగదీయాలి. దానిని మెల్లిగా చుట్టెస్తే గవ్వలా ఉంటుంది.అలా అన్ని చేసి పెట్టుకుని వేడి నూనెలో నిదానంగా కాల్చాలి.వాటిని వేడిమీదనే పాకంలో వేయాలి. పాకం పీల్చుకున్న తర్వాత తీసి విడివిడిగా ఆరబెట్టి డబ్బాలో వేసి పెట్టుకోవాలి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment