జింజర్ గార్లిక్ ఫిష్ ఫ్రై-
కావలసినవి
చందువా చేపలు: 2,
అల్లం: అంగుళంముక్క,
వెల్లుల్లి: ఒకపాయ,
చిల్లీసాస్: 3 టీస్పూన్లు,
ఉప్పు: టీ స్పూను,
నూనె: 50మి.లీ.,
కార్న్‌ఫ్లోర్: 50గ్రా.
తయారుచేసే విధానం
* చందువా చేప లేదా ఇతర ఏ రకం చేపనయినా తీసుకుని వాటిమీద పొలుసులన్నీ తీసేసి శుభ్రం చేయాలి. తరవాత బాగా కడిగి చాకుతో గాట్లు పెట్టాలి.
* చేపలకి ఉప్పు, నిమ్మరసం పూసి పది నిమిషాలు నానబెట్టాలి.
* అల్లం వెల్లుల్లిని చాకుతోనే బాగా సన్నగా తరిగి ఖైమా చేసినట్లుగా కొట్టాలి.
* ఇప్పుడు దీన్ని చేపకు పట్టించి తరవాత చిల్లీసాస్ కూడా పూసి ఆపై కార్న్‌ఫ్లోర్‌లో అద్దాలి.
* ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగాక చేపల్ని వేసి రెండువైపులా బాగా వేయించి తీయాలి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment