Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

ముత్యాలపాయసం


కావలసినవి:
స్వీట్‌కార్న్‌ గింజలు : 100గ్రా.,
పాలు : అరలీటరు,
కస్టర్డ్‌ పౌడర్‌ : 2 టేబుల్‌స్పూన్లు,
పంచదార : అరకప్పు,
యాలకులపొడి : అరటీస్పూను.
తయారుచేసే విధానం
* స్వీట్‌కార్న్‌ గింజల్ని ఉడికించి పక్కన ఉంచాలి.
* ఓ గిన్నెలో పాలుపోసి వేడి చేయాలి.
* విడిగా ఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కస్టర్డ్‌ పొడి వేసి కలిపి దీన్ని పాలల్లో కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడగానే పంచదార కూడా కలిపి కరిగించాలి. తరవాత స్వీట్‌కార్న్‌ గింజల్ని కూడా వేసి చల్లార్చాలి. చివరగా యాలకులపొడి కలిపితే పాయసం రెడీ. రుచికోసం జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసుకోవచ్చు.

0 comments:

Post a Comment