Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

రవ్వ పులిహోర


కావలసినవి
బియ్యంరవ్వ: 2 కప్పులు,
నిమ్మకాయలు: 2,
ఇంగువ: అరటీస్పూను,
గింజలు: టేబుల్‌స్పూను,
ఉప్పు: సరిపడా,
నూనె: 6 టీస్పూన్లు,
పసుపు: టీస్పూను,
కరివేపాకు: 4 రెబ్బలు,
పచ్చిమిర్చి: 2,
పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: 2, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
*బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
* బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
* ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.

0 comments:

Post a Comment