పెసరపప్పు సమోసా
కావలసినవి:
మైదా - కప్పు,
పెసర పొడి - అరకప్పు,
ఉడికించిన పెసలు - కప్పు,
ఉడికించి.. మెత్తగా చేసిన బంగాళదుంపల ముద్ద- అరకప్పు,
పచ్చిమిర్చి - 2 (సన్నగా కోయాలి),
పుదీనా తురుము- రెండుచెంచాలు,
ధనియాలు,
ధనియాల పొడి,
ఎండుమామిడి పొడి - చెంచా చొప్పున,
ఉప్పు - తగినంత,
కారం,
గరంమసాలా -అరచెంచా చొప్పున,
నూనె -వేయించేందుకు సరిపడా.
తయారీ:
చెంచా నూనెను వేడిచేసి.. ఉడికించిన పెసలు వేయించాలి. మూడునిమిషాలయ్యాక పెసరపొడి, మైదా తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ చేర్చాలి ఐదునిమిషాలు వేయించాలి. ఇప్పుడు పెసలపిండి, మైదాను చపాతీపిండిలా కలపాలి. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తి.. మధ్యలో అర్థచంద్రాకారం వచ్చేలాక కోయాలి. ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కూరి నీటితో త్రికోణాకారంలో మూసేయాలి. ఎర్రగా వేగేదాకా నూనెలో వేయిస్తే వేడివేడి సమోసా రెడీ.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment