Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

గుమ్మడికాయ పప్పు


కావలసిన పదార్థాలు :
గరంమసాలా...ఒక టీ.
కొబ్బరి తరుగు... అర కప్పు
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగులు...సరిపడా
నూనె, మీగడ... ఒక టీ.
కారం, ఉప్పు... సరిపడా
టమాటా తరుగు... అర కప్పు
గుమ్మడి ముక్కలు... ఒకటిన్నర కప్పు
బంగళాదుంపలు....అర కప్పు
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
పచ్చిమిర్చి తరుగు... పావు కప్పు

తయారీ విధానం :
కందిపప్పు, బంగాళా దుంపల్ని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. స్టౌమీద బాణలి వేడయ్యాక నూనెపోసి తాలింపు వేసి, తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి దోరగా వేయించాలి. తర్వాత పుదీనా, కరివేపాకు, ఆలు, గుమ్మడి తరుగులు ఒక్కొక్కటిగా వేసి వేపాలి.

తరువాత ఉప్పు, కారం, టమోటా, గరం మసాలా వేసి కొంచెం నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. పదినిమిషాల తర్వాత దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఈ గుమ్మడి పప్పును రైస్‌తో పాటు రోటీలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు

0 comments:

Post a Comment