
కావలసిన పదార్థాలు :
సెనగపిండి... 140 గ్రా.
గరంమసాలా... రెండు టీ.
పసుపు... ఒక టీ.
పచ్చిమిరపకాయలు... 3 (గింజలు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి)
చిన్నమామిడికాయ... ఒకటి (సన్నగా తురమాలి)
ఉల్లికాడలు... నాలుగు
పచ్చి రొయ్యలు... 200 గ్రా.
నూనె, ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, మసాలా దినుసులు, ఉప్పు వేసి నీళ్ళతో పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత మామిడికాయ తురుము, ముక్కలు చేసిన రొయ్యలు, ఉల్లికాడలు కూడా వేసి బాగా కలసిపోయేలా పిండిని కలపాలి. మూకుడులో నూనె పోసి వేడయ్యాక పకోడీల్లాగా వేయాలి. పకోడీలు బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వాటిని వేయించి, కాగితంపైన వేస్తే నూనె పీల్చుకుని కరకరలాడుతూ ఉంటాయి. ఈ పకోడీలను కొబ్బరిచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
0 comments:
Post a Comment