
కావలసిన పదార్థాలు :
పచ్చి మామిడికాయలు.. మూడు
కందిపప్పు.. ఒక కప్పు
నెయ్యి.. 2 టీస్పూన్లు
ఉప్పు.. తగినంత
జీలకర్ర, ఆవాలు, మెంతులు.. పోపుకు సరిపడా
పసుపు.. అర టీ.
వెల్లుల్లి.. 4 రేకలు
తయారీ విధానం :
ముందుగా మామిడికాయలను సన్నగా తురిమి ఉంచుకోవాలి. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలు వేసి పోపు పెట్టి తురిమి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా వేయించాలి. ఆ తరువాత పప్పు, పచ్చిమిరపకాయల్ని కూడా దానికి కలిపి సరిపడేంత నీరు పోసి బాగా ఉడికించి దించేయాలి. అంతే మామిడికాయ పప్పు రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది. మీరూ ట్రై చేసి చూడండి.
0 comments:
Post a Comment