కరివేపాకు పొడి
కావలసిన పదార్థాలు :
కరివేపాకు... ఒక కప్పు
ఎండుమిర్చి... నాలుగు
జీలకర్ర... ఒక టీ.
ధనియాలు... రెండు టీ.
చింతపండు... సరిపడా
మినప్పప్పు... రెండు టీ.
శనగపప్పు... రెండు టీ.
వేరుశనగలు... నాలుగు టీ.
తురిమిన పచ్చి కొబ్బరి... 1/4 కప్పు
వెల్లుల్లి... ఐదు రెబ్బలు
నెయ్యి... రెండు టీ.
నూనె... ఒక టీ.
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి.
బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడికి కొబ్బరి పొడి కూడా కలిపి తడి ఆరిపోయి, పొడి పొడిగా అయ్యేదాకా వేయించి దింపేయాలి. అంతే కరివేపాకు పొడి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ శక్తిని కలిగివున్న కరివేపాకుతో తయారు చేసిన పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment