మసాలా బీన్స్
కావలసిన పదార్థాలు :
సోయా చిక్కుళ్లు.. పావు కేజీ
ఉల్లిపాయలు.. వంద గ్రా.
టొమోటోలు.. 50 గ్రా.
వెల్లుల్లి.. 25 గ్రా.
అల్లం.. 15 గ్రా.
పచ్చిమిర్చి.. 10 గ్రా.
పసుపు.. తగినంత
ఛాట్ మసాలా.. రెండు టీ.
నూనె.. సరిపడా
ఉప్పు.. తగినంత
తయారీ విధానం :
సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్‌లో పది నిమిషాలు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, టొమోటో, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాక.. ఉల్లిపాయలు, టొమోటో ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి.
ఆపై పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు వేయించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. చివర్లో ఛాట్‌మసాలా చల్లి.. వేడిగా ఉన్నప్పుడే అతిథులకు అందించాలి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment