
కావలసినవి:-
బంగాళాదుంపలు: నాలుగు,
మెంతికూర: కట్ట(పెద్దది),
పసుపు: పావుటీస్పూను,
జీలకర్ర: టీస్పూను,
కారం: టీస్పూను,
ఉప్పు: తగినంత,
నూనె: సరిపడా.
తయారుచేసే విధానం:-
* మెంతికూరను శుభ్రంగా కడిగి కోసి ఉంచాలి.
* బంగాళాదుంపలు చెక్కు తీసి ముక్కలు కోసి ఉప్పునీళ్లలో వేసి ఉంచాలి.
* ఓ బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేయాలి. వేగాక ఉప్పు, పసుపు, కారం వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి.
* ఇప్పుడు బంగాళాదుంపముక్కలు, మెంతికూర వేసి మంటను మీడియంలో ఉంచి మూత పెట్టేయాలి. పదినిమిషాల్లో ఆలూమేతీ రెడీ. ఇది చాలా త్వరగా అయిపోయే కూర.
0 comments:
Post a Comment