Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

టమోటా ఆవకాయ


కావలసిన పదార్థాలు :
టమోటాలు- 1 కిలో
నూనె- పావు కిలో
చింతపండు- 150 గ్రా
కారం- 125 గ్రా
ఉప్పు- పావు కిలో
అల్లంవెల్లుల్లి పేస్ట్- పావుకిలో
జీలకర్ర పొడి- 50 గ్రా
మెంతిపొడి-25 గ్రా
జీలకర్ర- 2 టీ చెంచాలు
ఆవాలు- 1 టీ చెంచా
ఇంగువ-చిటికెడు

తయారీ విధానం : చింపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇంగువ, జీలకర్ర, ఆవాలు నూనెలో వేయించి తీయాలి. చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దీంతో టమోటా ఆవకాయ తయారయినట్లే. ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది

0 comments:

Post a Comment