బీట్‌రూట్ చట్నీ
కావలసిన పదార్థాలు : బీట్‌రూట్- అర కిలో
చింతపండు- కొద్దిగా
పసుపు- చిటికెడు
ఎండు మిరపకాయలు- 10
ఆవాలు- చెంచా
మెంతులు - కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
మినపపప్పు- చెంచా
ఉప్పు- తగినంత
కరివేపాకు- ఒక రెమ్మ
నూనె-50 గ్రాములు.
తయారీ విధానం : ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ని పచ్చివాసన పోయేదాక నూనెలో వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకుముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి. ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినపపప్పు, ఆవాలు, కరివేపాకు, తాలింపువేసి కలుపుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment