
కావలసిన పదార్థాలు:-
బొంబాయి రవ్వ - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
టొమాటో - 1
బంగాళాదుంప - 1
కాలీఫ్లవర్ ముక్కలు - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
ఆవాలు - 1 చెంచా
శెనగపప్పు - 1 చెంచా
మినప్పుప్పు - అర చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
అల్లం ముక్క - చిన్నది
కరివేపాకు - 1 రెమ్మ
నెయ్యి - 1 చెంచా
ఉప్పు, నీరు - తగినంత
తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. నెయ్యి వేడిచేసి శెనగపప్పు, మినప్పుప్పు, ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు, ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి.
0 comments:
Post a Comment