
కావలసినవి:-
పాలకూర: 5 కట్టలు,
బంగాళాదుంపలు: అరకిలో,
మెంతులు: పావు టీస్పూను,
జీలకర్ర: అరటీస్పూను,
టొమాటోముక్కలు: కప్పు,
పసుపు: పావుటీస్పూను,
కారం: అరటీస్పూను,
నూనె: 2 టీస్పూన్లు.
తయారుచేసే విధానం:-
* పాలకూరను బాగా కడిగి సన్నగా తరిగి ఉంచాలి.
* బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉడికించాలి. తరవాత పొట్టు తీసి పక్కన ఉంచాలి.
* ఓ నాన్‌స్టిక్ పాన్‌లో మెంతులు, జీలకర్ర, వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, టొమాటోముక్కలు, పాలకూర వేసి మూతపెట్టి 20 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. కొంచెం గ్రేవీ ఉండగానే బంగాళాదుంపముక్కలు వేసి మరో పదినిమిషాలు ఉడికించి దించాలి.
0 comments:
Post a Comment