బటర్డ్ రైస్
కావలసిన పదార్థాలు:_
బాస్మతి బియ్యం: అరకిలో,
వెన్న: 2 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం:-
* బియ్యం కడిగి గంటసేపు నానబెట్టాలి.
* మందపాటి గిన్నె లేదా కుక్కర్‌లో ఒకటికి ఒకటిన్నర చొప్పున నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి.
* అన్నం సగం ఉడికిందనుకున్న తరవాత నీళ్లు వంపేయాలి.
* మరో గిన్నెలో వెన్న వేసి కరిగిన తరవాత ఉడికించిన అన్నం వేసి గాలి చొరకుండా మూతపెట్టి తక్కువ మంటమీద 15-20 నిమిషాలు ఉడికించాలి. పర్షియన్లు ఈ రైస్‌లోకి చెలో కబాబ్ నంజుకుని తింటారు. అన్ని ఇరానీ రెస్టారెంట్లలోనూ దొరికే సంప్రదాయ వంటకం ఇది.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment