Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

క్రాకిలింగ్‌ పాలక్‌


కావలసినవి:-
తాజా పాలకూర: 3 కట్టలు,
పచ్చిమిర్చి: 4,
అల్లం: అంగుళంముక్క (చిన్న ముక్కలుగా కోయాలి),
వెల్లుల్లి: ఆరు రెబ్బలు (చిన్నముక్కలుగా కోయాలి),
కార్న్‌ఫ్లోర్‌: 6 టీస్పూన్లు,
మైదా: 4 టీస్పూన్లు,
పచ్చిమిర్చి: మూడు,
మిరియాలపొడి: అరటీస్పూను, అ
జినొమాటో: పావుటీస్పూను,
పంచదార: అరటీస్పూను,
బాదం: నాలుగు,
ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం:-
* పాలకూర కడిగి సన్నగా తరగాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు... అన్నీ వేసి కలపాలి.

* ఓ బాణలిలో నూనె పోసి ఈ పాలకూర మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని పకోడీల మాదిరిగా వేయించాలి.
* విడిగా మరో బాణలిలో టీస్పూను నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, అజినొమాటొ, ఉప్పు, మిరియాలపొడి వేసి వేయించిన పాలకూర ముక్కలు కూడా వేసి కలిపి దించాలి. చివరగా బాదం ముక్కలతో అలంకరించాలి.

0 comments:

Post a Comment