పటి సప్త
కావలసినవి:-
కొబ్బరికాయ: అరచిప్ప,
పంచదార: 200గ్రా.,
పాలు: ఒకటిన్నర లీటర్లు,
మైదా: 100గ్రా.,
బొంబాయిరవ్వ: అరకప్పు,
పంచదార: టేబుల్‌స్పూను,
నెయ్యి: తగినంత,
బాదంపప్పు: టీస్పూను,
పిస్తా: టీస్పూను,
యాలకులపొడి: అరటీస్పూను.
తయారుచేసే విధానం
* మందపాటి బాణలి తీసుకుని వేడి చేయాలి. అందులో లీటరు పాలు పోసి 100 గ్రాముల పంచదార కూడా వేసి బాగా మరిగించాలి. పాలు సగానికి సగం తగ్గాలి. తరవాత పక్కన ఉంచి చల్లారనివ్వాలి.
* ఇప్పుడు విడిగా మరో బాణలి తీసుకుని అందులో కొబ్బరి తురుము, మిగిలిన పాలు పోసి చిక్కబడేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన పంచదార కూడా వేసి తిప్పాలి. మిశ్రమం ఉండగా వచ్చేవరకూ ఉడికించి దించి చల్లారనివ్వాలి.
* మైదాలో రవ్వ, టీస్పూను పంచదార, టీస్పూను నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలపాలి. దీన్ని చిన్న ముద్దల్లా తీసుకుని పలుచని చపాతీల్లా వత్తాలి. తరవాత అందులో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ఫొటోలో చూపించినట్లుగా మడవాలి. వీటిని పెనంమీద రెండువైపులా నెయ్యితో కాల్చి తీయాలి. తరవాత వీటిని ఓ డిష్‌లో పెట్టి వాటిమీద పాలమిశ్రమాన్ని పోయాలి. ఆపై బాదం, పిస్తాలతో అలంకరించి వడ్డిస్తే సరి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment