పెసర పూరీలు
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు... ఒక కప్పు
గోధుమపిండి.. 4 కప్పులు
పచ్చిమిర్చి.. 6
ఉప్పు.. తగినంత
కారం.. ఒక టీ.
పసుపు.. చిటికెడు
నూనె.. సరిపడా
తయారీ విధానం :
పెసరపప్పును రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత పప్పులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి. కారం ఎక్కువగా ఉండాలనుకునేవారు ఇంకాస్త ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేసి అందులో పెసరపప్పు ముద్దవేసి.. ఐదు నిమిషాలపాటు వేడిచేస్తే నీరంతా ఆవిరై పిండి గట్టిపడుతుంది.ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి ముందుగానే ఒత్తి ఉంచుకున్న గోధుమపిండి పూరీల మధ్యలో దీన్ని ఉంచి చివర్లు మూసివేసి మళ్లీ పూరీల్లాగా వత్తాలి. వీటిని బాగా కాగుతున్న నూనె వేసి రెండువైపులా కాల్చి తీసివేస్తే.. పెసర పూరీలు సిద్ధం. పెరుగు పచ్చడితో కలిపి తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment