Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

పుల్లటి పెరుగుతో "తందూరి చికెన్" విత్ సాస్..!


కావలసిన పదార్థాలు :
కొవ్వు తక్కువగా ఉండే చికెన్.. 1 కేజీ
వెల్లుల్లి రేకలు.. ఆరు
అల్లం.. తగినంత
పుల్లటి పెరుగు.. పావు కేజీ
నూనె.. 125 గ్రా.
పసుపు.. చిటికెడు
ఉప్పు.. సరిపడా
మిఠాయిరంగు.. తగినంత

తయారీ విధానం :
ఒక కోడి మొత్తం తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోవాలి. పైన చర్మం అంతా తీసివేసి చాకుతో బాగా గాట్లు పెట్టి పెద్ద ముక్కలుగా కోయాలి. తరువాత అల్లం, వెల్లుల్లిలను ముద్ద చేసుకోవాలి. ఉప్పు, పసుపు, మిఠాయి రంగు కలిపి కోడి ముక్కలకు పట్టించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వాటికి పట్టించి, పుల్లటి పెరుగును కూడా కలిపి అరగంటసేపు నానబెట్టాలి.

మసాలా, పెరుగు మిశ్రమాలు ముక్కలకు బాగా పట్టిన తరువాత వాటిని తీసి నీటిని పిండేసి పక్కనుంచాలి. పొయ్యిమీద మూకుడు పెట్టి బాగా కాగిన తరువాత అందులో నూనె పోయాలి. నూనె కాగిన తరువాత మాంసం ముక్కలు ఒక్కోటి వేసి ఎర్రగా అయ్యేంతదాకా వేయించి తీసేయాలి. ముక్కలు వేగుతుండగా కాస్తంత మిఠాయిరంగు కలిపితే కంటికి ఇంపుగా ఉంటాయి. అంతే ఎర్రగా ఘుమఘుమలాడే తందూరీ చికెన్ తయార్. ఈ తందూరి చికెన్‌ను అలాగే అయినా, ఏదేని సాస్‌తో లేదా రోటీలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది

0 comments:

Post a Comment