Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

పసందైన పరోటా కర్రీ "జుగల్ ప్రాన్స్


కావలసిన పదార్థాలు :
పచ్చిబఠాణీలు.. పావు కేజీ
రొయ్యలు.. పావు కేజీ
దాల్చిన చెక్క.. నాలుగు
లవంగాలు.. నాలుగు
ఉల్లిపాయలు.. రెండు
కారం.. రెండు టీ.
ఉప్పు.. తగినంత
గసగసాలు.. రెండు టీ.
కొబ్బరిముక్క.. ఒకటి
టమోటోలు.. 50 గ్రా.
నూనె.. 50 గ్రా.
అల్లం.. ఒక ముక్క
పచ్చిమిర్చి.. నాలుగు
కొత్తిమీర.. ఒక కట్ట
పసుపు.. కొంచెం

తయారీ విధానం :
రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. బఠానీలను వేరే గిన్నెలో నానబెట్టి ఉంచుకోవాలి. టొమోటోలను కడిగి సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లిపాయల్ని తరిగి ఉంచుకోవాలి. గసగసాలు, కొబ్బరిని కలిపి ముద్దగా నూరాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఉల్లిముక్కలు వేసి కాసేపు వేయించాలి. తరువాత అందులోనే రొయ్యలు, అల్లంముద్ద వేసి మూతపెట్టాలి.

బాగా ఇగిరిన తరువాత ఉప్పు, కారం చల్లి తగినన్ని నీళ్లు పోయాలి. కూర కాసేపు ఉడికిన తరువాత బఠానీలను వేయాలి. అవి కూడా ఉడికిన తరువాత టొమోటో ముక్కలు, కొబ్బరి గసగసాల ముద్ద వేయాలి. టొమోటో కూడా బాగా ఉడికిన తరువాత కొత్తిమీర వేసి గ్రేవీ ఉండేటట్లుగా చూసి దించుకోవాలి. అంతే వేడి వేడి పరోటా కర్రీ జుగల్ ప్రాన్స్ తయార్..!

0 comments:

Post a Comment