
కావలసిన పదార్థాలు :
మటన్... అర కేజీ
టమోటాలు... పావు కేజీ
వేడినీరు... ఒక కప్పు
జీలకర్ర... ఒక టీ.
కారం... ఒక టీ.
వెల్లుల్లిముక్కలు... ఒక టీ.
కొత్తిమీర... సరిపడా
బటర్... రెండు టీ.
ఉల్లిపాయలు... నాలుగు
క్రీం... పావు కప్పు
పసుపు... ఒక టీ.
ధనియాలపొడి... ఒక టీ.
అల్లం ముక్కలు... ఒక టీ.
గరంమసాలా... ఒక టీ.
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
పాన్‌లో రెండు టీస్పూన్ల బటర్ వేసి మటన్ ముక్కలను 11 నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత జీలకర్ర, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, కారం వేసి బాగా కలుపుతూ వేయించాలి. వీటికి మటన్ ముక్కలు, ఉల్లిముక్కలనను కూడా కలిపి మరో పదినిమిషాలపాటు వేయించాలి.
పైవన్నీ బాగా వేగిన తరువాత టమోటోలను చేర్చి మరో రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఆపై దీనికి వేడినీరు, ఉప్పును కలపాలి. అరగంటసేపు సన్నని మంటమీద కూరను ఉడికించాలి. ఉడికిన కూరకు గరం మసాలా, క్రీం, కొత్తిమీరలను కలిపి పొయ్యిమీద నుండి దించేయాలి.
0 comments:
Post a Comment