
కావలసిన పదార్థాలు:-
రొయ్యలు - అర కిలో
నీళ్లు - 3 కప్పులు
దోసకాయ (చిన్నది) - 1
మొక్కజోన్న పిండి - 2 చెంచాలు
వెన్న/నెయ్యి - 2 చెంచాలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
ఉప్పు,నూనె - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:-
రొయ్యలను ఒలిచి,శుభ్రంగా కడగాలి. దోసకాయలను సన్నగా తురుముకోవాలి. నెయ్యి/వెన్నను వేడిచేసి రొయ్యలు వేయాలి. ఎరుపురంగులోకి వచ్చాక అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాల తరువాత దోసకాయ తురుము, ఉప్పు వేయాలి. మరో ఐదు నిమిషాలుంచి నీరు పోయాలి. నీళ్లు మరుగుతుండగా మొక్కజోన్న పిండి వేయాలి. మూతపెట్టి, సన్నని మంటమీద మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించుకుని, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
0 comments:
Post a Comment