బెండకాయ మటన్ కర్రీ
కావలసిన పదార్థాలు :
మాంసం... అర కేజీ
చింతపండు... నిమ్మకాయంత
బెండకాయలు... పావు కేజీ
ఉల్లిపాయలు... మూడు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
కారం... రెండు టీ.
పసుపు.. అర టీ.
పెరుగు... రెండు టీ.
గరంమసాలా... అర టీ.
కొత్తిమీర తురుము... అర కప్పు
నూనె... అర కప్పు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
చింతపండులో కప్పు నీటిని పోసి పావుగంటసేపు నానబెట్టాలి. బెండకాయల ముందూ వెనుకలు కోసివేసి, బాణలిలో నూనె వేసి కాయల్ని వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కల్ని, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఉప్పు, పసుపు, కారం కలిపి కొద్దిగా నీటిని పోసి తిప్పాలి. అందులోనే మటన్ ముక్కలు వేసి నీరు ఆవిరైపోయేంతదాకా ఉడికించాలి.
ఈ మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరువాత చింతపండు రసం, పెరుగు, బెండకాయ ముక్కలు వేసి అవసరమైతే మరికొన్ని నీళ్ళు పోసి తక్కువ మంటమీద ఉడికించాలి. దీనికి కాస్తంత గరంమసాలా, కొత్తిమీర చల్లి గ్రేవీ చిక్కబడగానే దించేయాలి. అంతే వేడి వేడి బెండకాయ మటన్ కూర రెడీ.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment