స్టఫ్‌డ్ ఎగ్స్" విత్ పెప్పర్.. సలాడ్ ఆయిల్
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు... ఐదు
మెయెనెజ్ సాస్ తయారీకి గుడ్లు... రెండు (పచ్చసొన మాత్రమే తీయాలి)
సలాడ్ ఆయిల్... 150 మిల్లీ లీటర్
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... తగినంత
వెనిగర్... సరిపడా
తయారీ విధానం :
కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సాస్ కోసం రెండు గుడ్లను పగులగొట్టి అందులోని పచ్చసొనను మాత్రమే తీసుకుని సలాడ్ ఆయిల్ ఒక్కో చుక్క వేస్తూ... నెమ్మదిగా మెయెనెజ్ సాస్‌ను తయారు చేయాలి. అందులో వెనిగర్, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి.
ఇప్పుడు ఉడికించిన గుడ్లను నిలువుగా సగానికి కోయాలి. పచ్చసొనను జాగ్రత్తగా తొలగించాలి. తొలగించిన పచ్చసొనను సాస్‌లో కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని స్పూన్‌తో నిలువుగా కోసిన గుడ్డు ముక్కలో నింపాలి. సన్నగా తరిగిన బెంగళూరు మిర్చి, టొమోటో ముక్కలను పైన అలంకరించి సర్వ్ చేయాలి.
Posted by
Moderator
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment