Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

పూతరేకులు


బియ్యం పిండి 100 gm
పంచదార 250 gm
నెయ్యి 100 gm

ఈ పూతరేకులు చేయాలంటే చాల నేర్పు ఓర్పు కావాలి.చేయుటకు ప్రత్యేకమైన కుండఉంటుంది. బియ్యపు పిండిని కూడా నలక పడితే కనపడేటంత మెత్తగా రుబ్బాలి.కుండను బోర్లించి లొపలి భాగంలో మంట పెట్టాలి. పైభాగంలో నెయ్యి రాచి క చేతి గుడ్డంత వెడల్పుగుడ్డను పలుచగా కలిపిన పిండిలో ముంచి కాలే కుండ మీద పరిచి వెంటనే లాగాలి. అప్పుడు పలుచని రేకులాగా లేస్తుంది. వాటినే పూతరేకులంటారు. ఇంత కష్టపడేకంటేపూతరేకులు మాత్రమే దొరుకుతాయి.అవి తెచ్చుకుని నెయ్యి పంచదార వేసి చుట్టుకుంటే చాలా త్వరగా తయారవుతాయి.
పంచదారను మెత్తగ పొడి చెసి పెట్టుకోవాలి. మంచి నెయ్యి కరగపెట్టాలి. ఒక గుడ్డ రిచి రెండు రేకులు పరిచి నెయ్యి పంచదార చల్లి మడిచి చాప చుట్టాలుగా చేసి పెట్టుకోవాలి. ఇవి తినటానికి చాలా రుచిగా కరిగిపోయేలా ఉంటాయి.

క్యాబేజీ కూర


క్యాబేజీ 250gm
ఎండు మిర్చి 6
ఆవాలు 1/2gm
జీలకర్ర 1/2gm
పసుపు 1/2gm
మినప్పప్పు 1 tbsp
శనగపప్పు 2 tbsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 2 tbsp
నూనె 3 tbsp
ఉప్పు తగినంత
ముందుగా క్యాబేజీని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు,శనగపప్పు, పసుపు వేసి కొద్దిగా వేపి క్యాబేజీ, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఇది చిన్న మంటపై నూనెలోనే మగ్గిపోతుంది.చివరగా గరం మసాల, తరిగిన కొత్తిమిర చల్లి దించేయడమే.ఇది చపాతీలలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది త్వరగా చేసుకోవచ్చు కాని క్యాబేజీని మాత్రం చాలా సన్నగా దారాల్లాగా తరగాలి.

పాలకూర పకోడీ


పాలకూర 2 కప్పులు
శనగపిండి 1 కప్పు
ఉల్లిపాయలు 200 gm
కారంపొడి 1 tsp
పసుపు చిటికెడు
వాము 1 tsp
ధనియాల పొడి 2 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించదానికి

ముందుగా పాలకూరను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఉల్లిపాయలు కూడా సన్నగా నిలువుగా తరిగి ఉంచుకోవాలి.ఒక గిన్నెలో ఉల్లిపాయలు వేసి చెతితో బాగా పిసికి అందులో పాలకూర, శనగపిండి,కారం, పసుపు,వాము,ధనియాల పొడి వేసి బాగా కలిపి కాగిన నూనెలో చిన్న చిన్న ముద్దలుగా, పొడిపొడిగా వేసి ఎర్రగా కాల్చాలి.ఇందులొ కూడా నీరు పోయనవసరం లేదు. పాలకూర,ఉల్లిపాయల తడి సరిపోతుంది.

జిలేబీ


మైదా 1 1/2 కప్పులు
చక్కెర 3 కప్పులు
వంట సోడా చిటికెడు
యాలకుల పొడి 1/2 tsp
నెయ్యి లేదా నూనె వేయించడానికి
పసుపు లేదా కేసర్ రంగు చిటికెడు


మైదాలో వంటసోడా వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది.మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కాస్త కావాలంటే కస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి.చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి.అందులోనే యాలకులపోడి కలిపాలి.జిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.జిలేబీలు చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో.జిలేబీలను ఎర్రగా వేయించి తీసి పాకంలో వేయాలి.పదినిమిషాల తర్వాత తీసి విడి పళ్ళెంలో పెట్టాలి.

వంకాయ కూర

వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 6-8
కొత్తిమిర 1/2 కప్పు
అల్లం 2 ‘ ముక్క
నూనె 4 tbsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
సెనగపప్పు 2 tsp
కరివేపాకు 1 tsp
పసుపు 1/2 tsp

వంకాయలు చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలి.ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడాసన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, కొత్తిమిర కలిపి నూరిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర, మినపప్పు,సెనగపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా ఎర్రబడిన తర్వాత నూరినముద్ద,కరివేపాకు వేసి కొద్దిగా వేపి వంకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై నీళ్ళు పోయకుండానె ఉడికిపోతుంది

బీట్రూట్ వేపుడు

బీట్రూట్ 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
పసుపు చిటికెడు
కారం పొడి 1 gm
ఉప్పు తగినంత
కొత్తిమిర 1 tbsp
పచ్చికొబ్బరి 3 tbsp

ముందుగా బీట్రూట్ ను సన్నగా ముక్కలుగా కోసి కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలి.ఒక ఉల్లిపాయ చిన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.రెండు పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెవేడి చేసి ఆవాలు,జీలకర్ర,మినపప్పు ,సెనగపప్పు కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి.ఇప్పుడు బీట్రూట్ముక్కలు,పసుపు,కారం పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.చిన్న మంటపై నిదానంగా ఉడకనివ్వాలి.నీళ్ళు పోసే పని లేదు. ఉడికిన తర్వాత సన్నగ తరిగిన కొత్తిమిర కాని తురిమిన పచ్చికొబ్బరి కాని కలిపి దించేయాలి.

తీపి గవ్వలు


మైదా 250 gm
నెయ్యి లేదా డాల్డా 50 gm
ఉప్పు చిటికెడు
నూనె 250 gm
చక్కెర 250 gm
యాలకులు 5

ముందుగా చక్కెరలో అర గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకంలా చేసి యాలకుల పొడి కలిపి పెట్టుకోవాలి. మైదాలో కాచిన నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. గవ్వల పీటకు నూనె రాసి పెట్టుకోవాలి.మైదా పిండిని రెండుచేతులతో బాగా మర్ధన చేసి చాలా చిన్న ముద్దలుగా చేసిపెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మైదా ముద్దను గవ్వలపీటపై బొటనవేలితో వత్తుతూ సాగదీయాలి. దానిని మెల్లిగా చుట్టెస్తే గవ్వలా ఉంటుంది.అలా అన్ని చేసి పెట్టుకుని వేడి నూనెలో నిదానంగా కాల్చాలి.వాటిని వేడిమీదనే పాకంలో వేయాలి. పాకం పీల్చుకున్న తర్వాత తీసి విడివిడిగా ఆరబెట్టి డబ్బాలో వేసి పెట్టుకోవాలి.

గుత్తొంకాయ కూర

లేత వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 150 gm
పల్లీలు 50 gm
నువ్వులు 50gm
జీలకర్ర 1 tbsp
మెంతులు 1/2 tsp
కొబ్బరిపొడి 100 gm
చింతపండు పులుసు 1/4 cup
నూనె 50 gm
ఉప్పు తగినంత
కారం పొడి 1 tbsp
పసుపు 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp
బెల్లం కొంచం

ముందుగా ఖాళీ బాణలిలో జీలకర్ర,మెంతులు,పల్లీలు,నువ్వులు విడివిడిగా వేయించాలి.అవి పక్కన పెట్టి అందులోనే సగం నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ఇవి అన్ని కొబ్బరిపొడితో కలిపి రుబ్బి పెట్టుకోవాలి. ఈ ముద్దలో ఉప్పు,కారం పొడి,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,చింతపండు పులుసు,బెల్లం వెసి బాగ కలిపి పెట్టుకోవాలి..వంకాయలను నాలుగు
పక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీల్లల్లో వెసి పెట్టాలి. ఈ రుబ్బిన ముద్ద వంకాయ మధ్యలొ బాగా కూరి పక్కన పెట్టుకోవాలి.తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి కాగిన తర్వాత ఈ మసాల కూరిన వంకాయలను వేసి మూత పెట్టలి.ఈ కూరను నిదానంగ చిన్న మంటపై చేయాలి.అన్ని వంకాయలు మగ్గి మెతబడిన తర్వత మిగిలిన ముద్దలో కొద్దిగా నీరు కలిపి అందులో పోసి మెల్లిగ కలిపి మూత పెట్టాలి..కూర ఉడికిన తర్వాత నూనె తేలుతుంది.కొతిమిర చల్లి దించేయడమే..ఇక గుత్తొంకాయ కూర రేడి.

పప్పు చారు


కందిపప్పు 200 gm
చింతపండు 50 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 రెబ్బ
కొతిమిర 1 కట్ట
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 4
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp

ముందుగా కందిపప్పును కొద్దిగా పసుపు,నూనె వేసి కుక్కర్లో మెత్తగా
ఉడికించుకోవాలి. చింతపండు నీళ్ళలోనానబెట్టాలి . ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
టొమాటోలు తరిగి పెట్టుకోవాలి. పప్పును గరిటతో మెదిపి చింతపండు
పులుసు తీసి అందులో కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి
ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర వేసిఅవి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
టొమాటో ముక్కలు వేసి కొద్దిగావేపాలి. పసుపు,కారంపొడి,కరివేపాకు వేయాలి.
అవి మెత్తబడ్డాక పప్పు మిశ్రమాన్ని అందులో పోసి తగినంతఉప్పు,కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేయాలి. పప్పు చారు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత
కొత్తిమిర వేసిదింపేయాలి. కొద్దిగ నెయ్యి వేస్తె సూపర్ గా ఉంటుంది

Tomata Palavu


Banana Bonda

Rava Dosa


Indredients:

Rice Flour - 1 cup
Sooji - 1 cup
Maida - 1 cup
Onion - 1 small pieces
Green Chillies - 5 small pieces
Coriander - washed and chopped fine
Zeera - 1/2 spoon
Salt to taste
Water

Preparation:

Mix Sooji, Rice Flour and Maida well. Add water to this mixture and mix well to aviod plums in the paste.
Add Rest of the ingredients to the paste and mix well.
Add more water to the paste to make it very thin (rava dosa paste should be very thin).
Prepare dosa on a pan as usual. Coconut Chutney tastes well with rava dosa.