Telugu and Hindi movies are posted on request!! Post your requests to TELUGUSINEMA@GMAIL.COM

పీతల వేపుడు


పీతలు 1 kg
అల్లం వెల్లుల్లి 2 tsp
ఉల్లిపాయలు 4
నూనె 8 tsp
కొబ్బలిపొడి 3 tbsp
గసగసాలు 2 tsp
మజ్జిగ 1 గ్లాసు
లవంగాలు 6
యాలకులు 6
దాల్చిన చెక్క 4
ధనియాలు 2 tbsp
కొత్తిమిర 10 రెమ్మలు
కరివేపాకు 2 రెమ్మలు
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి 3

పీతలు శుభ్రపరచి మీక కావలసిన సైజులో ముక్కలు చేసుకుని కడిగి పెట్టుకోవాలి.
ఈ ముక్కలలో ఉప్పు,పసుపు వేసి గ్లాసు మజ్జిగ పోసి కొంచెం సేపు రాసి కడగాలి.
అల్లం వెల్లుల్లి,ఉప్పు కారం,పసుపు 2 లవంగాలు,2 యాలకులు,రెందు దాల్చిన
చెక్కలు మెత్తగా ముద్దగా నూరుకొని ఈ కడిగి ఉంచుకున్న ముక్కలకి బాగా
పట్టించాలి. రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిగిలిన
రెండు ఉల్లిపాయలు, మిగిలిన మసాలా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద
వెడల్పాటి బాణలి పెట్టి నూనె వేడి చేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించి పీతల
ముక్కలను వేసి ఐదు నిమిషాలు వేయించి సగం గ్లాసుడు నీళ్ళు పోసి నిదానంగా
ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నూరి ఉంచిన మసాలా ముద్దను వేసి కొత్తిమిర,
కర్వేపాకు సన్నగా తరిగి వేసి నీరంతా ఇగిరిన తర్వాత దించుకోవాలి.

Miriyala Annam


Ingredients:
3 cups of cooked white rice (each grain should be separate)
1 1/2 tbsp ghee (clarified butter)
1 tsp cumin seeds
3/4 tsp mustard seeds
1 1/2 tbsp black pepper corns
1 1/2 tbsp seasame seeds
10-12 curry leaves (fresh leaves only)
salt to taste

Method:
Dry roast the black pepper corns, sesame seeds and curry leaves in a pan for a few minutes on medium heat tossing
them around till the flavors come out and you find a nice aroma emanates the kitchen. Once the seasame seeds change color
you can turn off the heat and make a coarse powder.Heat ghee in a pan and add the mustard seeds and let them pop.
Add the cumin seeds and let them brown. Add the cooked rice and combine it with the tempering.
Now add the ground spice pwd and salt and combine the rice with it such that the spices coat the rice well.
The full flavor of the pepper is obtained on freshly ground pepper corns which enhances the taste of the rice giving it a sharper,
more lively flavor than the pre-ground pepper powder and also by adding it towards the end of the cooking process which further enhances its taste.
Serve hot with any gravy curry or plain rasam, appadam (papad) and curds.

Note: Use only fresh pepper corns and not pre-ground black pepper powder as it won’t serve any purpose and you are definitely not going to enjoy the flavor of the rice if you use the store bought pre-ground pepper powder. If you venture into your kitchen to cook up this simple flavorful dish be prepared to use only the freshly ground pepper corns

Mamidikaya Mukkalu Pachadi


Ingredients:
2 cups of finely chopped raw green mango pieces along with skin (washed and wipe dry)
2 tbsps red chilli pwd
2 tbsps mustard pwd (ava pindi)
1 tbsp salt
4-5 tbsps oil (sesame/til/nuvvulu)

Method:
Combine all the above ingredients and store in a clean, dry bottle and refrigerate.
Use a clean spoon to remove pickle. This pickle can be eaten within 8 hours of preparation.
I had written a few tips on how to make pickles which will help you during the pickling process.

Note:
Sun dry mustard seeds for a day and grind to a fine powder and store. For methi powder,
dry roast methi seeds till it reaches a red color, cool and grind to a fine powder.
Red chilli powder used for pickling is preferred. Its available in most super markets or departmental stores.
Sesame oil is best, incase you don’t have sesame, you can use any refined oil.
Remember to prepare pickles in moisture free area.

Beerakaya Kothimira Pachadi


Ingredients:
2 medium sized ridge gourds, washed and chopped into pieces with skin
1/2 cup chopped coriander leaves
3 green chillis, chop into big pieces (adjust)
1 tbsp bengal gram/senaga pappu/chana dal
1 tsp split gram dal/minappa pappu
1/4 tsp cumin seeds
1/2 tbsp sesame seeds/nuvullu/til
1 1/2 tbsps lemon juice
2-3 tsps oil
For seasoning/poppu/tadka:
1/2 tsp mustard seeds
pinch cumin seeds (optional)
1-2 dry red chillis
big pinch asafoetida/inguva/hing (optional)
few fresh curry leaves
1/2 tsp oil

Method:
Heat a tsp of oil in a cooking vessel, add bengal gram, split gram dal, cumin seeds and stir fry for a few seconds till the dals turn red.
Remove and keep aside.
2In the same vessel, add sesame seeds and fry on medium heat for 2-3 mts. Remove and keep aside.
3In the same vessel, add the green chillis and coriander leaves and fry on medium heat for 3 mts,
stirring constantly. Remove from pan and cool.
In the same pan, add another tsp of oil, add the chopped ridge gourd pieces
and stir fry for 4-5 mts till the rawness of the vegetable goes. Remove and cool.
Once cool, grind the dals first till coarsely ground, add the rest of the sauteed ingredients along with lemon juice and salt and grind to a coarse paste.
Heat a tsp of oil in a pan, add mustard seeds and let them pop, add curry leaves and dry red chillis followed by asafoetida and stir fry for a few seconds.
Pour the seasoning over the ground pachadi and serve with hot rice.

దోసకాయ పప్పు


కావలసిన వస్తువులు:
కందిపప్పు - 200 gms
చింతపండు పులుసు - పావు కప్పు
టొమాటోలు - 2
దోసకాయ - 1
మెంతికూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిరపకాయలు - ౩
కరివేపాకు - 1 రెబ్బ
కొత్తిమిర - 1 కట్ట
కారం పొడి - 1 tsp
పసుపు - చిటికెడు
వెల్లుల్లి - 5 పాయలు
ఉప్పు - తగినంత
నూనె - 2 tsp
తాలింపు గింజలు
ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు, పావు చెంచాడు నూనె వేసి మూట పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర, మెంతికూర, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు (చేదు చూసుకోవాలి), చింతపండు పులుసు, పసుపు,కారం, ఉప్పు వేసి కలిపి మరో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నూనె వేడి చేసి తాలింపు గింజలు, నలగగొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టి ఈ పప్పులో కలపాలి. కొద్దిగా నెయ్యి వేసి మూతపెడితే ఘుమ ఘుమలాడిపోతుంది పప్పు. ఆవకాయ లేదా అప్పడాలు నంజుకుని తినండి.

సేమ్యా పులిహోర

సేమ్యా 500 gm
మంచి నూనె 150 gm
వేరుశనగపప్పు 100 gm
నిమ్మకాయలు 5
పచ్చి మిరపకాయలు 10
ఎండు మిరపకాయలు 10
పసుపు 1 tbsp
ఉప్పు తగినంత
కరివేపాకు 4 రెబ్బలు
అల్లం అంగుళం ముక్క
శనగపప్పు 3 tbsp
మినపప్పు 1 tbsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 2 tsp

ముందుగా సేమ్యాను కొలుచుకుని ఎన్ని గ్లాసులైతే అంతకు రెండింతలు గ్లాసుల నీళ్ళు ఒక పెద్ద గిన్నెలో తీసుకుని అందులో పసుపు వేసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి.నీళ్ళు బాగా పొంగు వచ్చాక కొలిచి పెట్టుకున్న సేమ్యాను వేసి పలుకుగా ఉన్నప్పుడే దించి ఒక చిల్లుల గిన్నెలో వేయాలి.వెంటనే చల్లని నీళ్ళు పోయాలి.ఇలా చేయడం వల్ల సేమ్యా విడివిడిగా అతుక్కోకుండా ఉంటాయి.తర్వాత బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఎండుమిర్చి,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేరుశనగపప్పు వరుసగా వేస్తూ దోరగా వేగిన తర్వాత ముక్కలు చేసిపెట్టుకున్న పచ్చిమిర్చి,అల్లం వేసి కొంచెం వేగగానే దించేయాలి.ఇందులో నిమ్మరసం పిండాలి.చలారిన సేమ్యాని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి ఈ పోపు మిశ్రమాన్ని వేసి అన్ని వైపులా బాగా కలియబెట్టి మూత వేసి ఉంచాలి.ఒ పది నిమిషాల తర్వాత తింటే చాలా
రుచిగా ఉంటుంది.

గ్రుడ్ల ఖుర్మా





గ్రుడ్లు 4
ఉల్లిపాయలు 100 gm
టొమాటొలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
ఎందుకొబ్బరిపొడి 2 tsp
ధనియాలపొడి 2 tsp
గసగసాలు 1 tsp
గరం మసాలా 1 tsp
పెరుగు 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా గ్రుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టి ఉంచాలి.నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తపడేవరకు వేయించాలి. పసుపు,అల్లం వెల్లుల్లి,కరివేపాకు,టొమాటో ముక్కలు వేసి అవి మెత్తపడేవరకు వేయించాలి.కొబ్బరిపొడి,వేయించిన గసగసాలు,ధనియాలపొడి,గరం మసాలా పొడి,పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకొని ఉడుకుతున్న కూరలో కలపాలి.కొద్ది సేపు ఉడికిన తర్వాత గ్రుడ్లు,కారం ,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.నూనె తేలిన తర్వాత కొత్తిమిర చల్లి దింపేయాలి.

చేపల పులుసు


చేపలు 1 kg
ఉల్లిపాయలు 250gm
కొబ్బరిపొడి 75 gm
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/2 tsp
ధనియాల పొడి 2 tbsp
కారంపొడి 2 tsp
పసుపు 1/2tsp
ఉప్పు తగినంత
చింతపండు 100 gm
అల్లం వెల్లుల్లి 1 tbsp
నూనె 5 tbsp

ముందుగా చేపలను శుభ్రం చేసుకుని అరంగుళం ముక్కలుగ కోసి పెట్టుకోవాలి.చింతపండును అరకప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఉల్లిపాయలు
సన్నగా తరిగి నూనెలో ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయలు,కొబ్బరిపొడి,ధనియాల పొడి,జీలకర్ర,మెంతిపొడి,కారం,పసుపు తగినంత ఉప్పు ,అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ కలిపి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి.చింతపండును చిక్కటి
పులుసు తీసి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర మెంతులు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు నూరిన ముద్ద కలిపి పోయాలి.చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోయాలి.ఇప్పుడు ఈ పులుసును బాగా మరగనివ్వాలి.
పులుపు వాసన పోయాక చేప ముక్కలు అందులో జాగ్రత్తగా వేయాలి.చేప ముక్కలు పులుసులో ఉడికి నూనె తేలాక దింపేయాలి.ఇది వేడిగా కాని చల్లగా కాని తినొచ్చు.దీనికి జొన్న రొట్టె ఉంటె సూపర్

తందూరీ చికెన్


చికెన్ 1 kg
పెరుగు 250 gm
నిమ్మకాయ 1
పుదీనా 1 కట్ట
కొత్తిమీర 1 కట్ట
గరం మసాలా 1 tsp
కారం పొడి 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
చాట్ మసాలా 2 tsp
రెడ్ ఆరెంజ్ కలర్ చిటికెడు
ఉప్పు తగినంత
నూనె 50 gm

ముందుగా చికెన్ ను శుబ్రంగా కడిగి,చర్మం తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి,కొద్ది సేపు నీరంతా పోయేలా ఆరనివ్వాలి.వాటికి కొంచం ఉప్పు, నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు పెరుగును బాగా కలిపి అందులో పుదీనా, కొత్తిమీర,మిగిలిన వస్తువులన్నింటిని కలిపి ముద్దగా రుబ్బుకొని ఈ చికెన్ ముక్కలను కలిపి గంటపాటు నాననివ్వాలి.ఇప్పుడు ఈ ముక్కలను తీసి ఒక చువ్వకు గుచ్చి బొగ్గులపొయ్యిమీద గాని తందూర్ ఒవెన్లో గాని పదిహేను నిమిషాలు తిప్పుతూ ఎర్రగా కాల్చాలి.

ఊరగాయ చికెన్

చికెన్ - 1 kg
కారం - 2 tsp
అల్లం వెల్లుల్లి - 2 tbsp
జీలకర్ర పొడి - 1 tsp
ధనియాల పొడి - 2 tbsp
నిమ్మకాయలు - 4
పచ్చిమిర్చి - 6
కరివేపాకు - 2 tbsp
ఉప్పు - తగినంత

తాలింపు కోసం :

జీలకర్ర - 1 tsp
ఆవాలు - 1 tsp
మెంతులు - 1/4 tsp
నూనె - 100 gm
ఎండుమిర్చి - 4

చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపి తడి ఆరనివ్వాలి . ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, ఉప్పు ,కారం, అల్లం వెల్లుల్లి, ధనియాలపొడి,జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నీ వేసి ఓ గంట సేపు నాననివ్వాలి. విడిగా మరో బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులన్నీ వేసి చిటపటలాడాక చికెన్ ముక్కలు మసాలాతో సహా వేసి కలియబెట్టి నిదానంగా ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి.

చక్ర పొంగలి


బియ్యం 100 gm
బెల్లం 150 gm
యాలకులు 5
నెయ్యి 50 gm
జీడిపప్పు 8

ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వాలి.తర్వాత మెత్తగా ఉడికించాలి.అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగేవరకు ఉడికించాలి.జీడీప్పు నేతిలో వేయించి, యాలకులపొడి మిగతా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయాలి.

పొంగలి పులిహోర


బియ్యం 300 gm
పెసరపప్పు 100 gm
పచ్చిమిర్చి 4
పసుపు 1/2 tsp
చింతపండుగుజ్జు 50gm
మినప్పప్పు 1 tsp
సెనగపప్పు 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
వేరుసెనగగుళ్ళు 3 tsp
ఎండుమిర్చి 5
కరివేపాకు 2 tsp
ఇంగువ చిటికెడు
నూనె 50 gm

ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి,ఓ పది నిమిషాలు నాననిచ్చి స్టవ్ మీద పెట్టి కాస్త పొడిపొడిగా అయ్యేటట్టు వండుకోవాలి. ఈ అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో పరిచి పసుపు తగినంత ఉప్పు కాస్త నూనె వేసి కలపాలి.బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి , ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు,సెనగపప్పు,వేరుసెనగగుళ్ళు,కరివేపాకు వేసి దోరగా వేయించి చింతపండు పులుసు వేసి
ఉడికించి ఈ అన్నంలో వేసి బాగా కలియబెట్టి పదినిమిషాల తర్వాత ఆరగించండి.

కరివేపాకు, కొత్తిమిర పచ్చడి


కొత్తిమిర - నాలుగు కట్టలు
కరివేపాకు - ౩ కట్టలు
పచ్చిమిరపకాయలు - ౪
చింతపండు పులుసు - ఒకటిన్నర స్పూను
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు

కొత్తిమిర, కరివేపాకు రెండింటిని సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు,ఉప్పు,చింతపండు పులుసు కలిపి మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులతో తాలింపు పెట్టి అందులో రుబ్బిన పచ్చడి వేసి కలిపి రెండు నిమిషాలపాటు సన్నని సెగమీద అలాగే ఉంచండి.ఆ తర్వాత వేడివేడి దోసెలతో వడ్డించండి.

రాగి అట్టు


మినప్పప్పు 100 gm
బియ్యపు పిండి 75 gm
రాగిపిండి 200 gm
పచ్చిమిరపకాయలు 4
నెయ్యి అర కప్పు
ఉప్పు తగినంత

మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు,
బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి.
తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు
ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా
కాల్చుకోవాలి. దీనికి కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.

మొలకలతో మసాలా కూర

మొలకెత్తిన పెసలు 150 gms
క్యాప్సికం అన్ని రంగులలో 6
ఉల్లిపాయ 1
అల్లం 1 " ముక్క
వెల్లుల్లి రెండు రెబ్బలు
నూనె 1 tsp
పంచదార చిటికెడు
ఉప్పు తగినంత

మూడు రంగుల క్యాప్సికమ్‌ని, ఉల్లిపాయని, సన్నగా ముక్కలు చేసుకోవాలి. కోసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. ఓ బాణలిలో నూనె వేడి చెసి అల్లం, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు,పంచదార కూడా వేసి గరిటతొ బాగా కలిపి దింపాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.

తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్


తమలపాకులు పెద్దవి 20
మష్రూమ్స్ 200 gms
బంగాళదుంపలు 2
ఉల్లికాడ ముక్కలు 4 tbsp
వేయించిన జీలకర్ర 50gms
చీజ్ 50 gms
చాట్ మసాలా పొడి 1 tsp
శనగపిండి 250 gms
అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp
వాము 4 tsp
కారం పొడి 4 tsp
కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి

తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్, ఉల్లికాడముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వు అన్నీ బాగా కలపాలి. ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్‌లా చుట్టాలి. అవి విడిపోకుండా టూత్ పిక్స్ గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా కలపాలి. ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటి మీద చాట్ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.

పనీర్ సాండ్‌విచ్

పన్నీర్ 400 gms
పుదీనా చట్ని 4 tsp
టొమాటో కెచప్ 4 tsp
మిరియాల పొడి 1/4tsp
నూనె తగినంత
ఉప్పు తగినంత
అలంకరించడానికి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలుపనీర్‌ను రెండడుగుల మందం కలిగిన ముక్కలుగా కోసుకోవాలి. వీటిమీద కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పనీర్ ముక్కలను వేయించాలి. పనీర్ మెత్తగా ఉండాలనుకుంటే బేక్ చేయొచ్చు లేదా ఆవిరి మీద ఉడికించొచ్చు. ఒక ప్లేట్‌లో పనీర్ ముక్కలను తీసుకుని ఒక ముక్కపై పుదీనా చట్నీ పూసి దానిపై మరో పనీర్ ముక్కను పెట్టాలి. దానిపై టోమాటో కెచప్ పూసి మరో పనీర్ ముక్కను పెట్టాలి. దానిపై క్యాప్సికం, టోమాటో ముక్కలతో అలంకరించి వేడిగా వడ్డించాలి.

సొరకాయ పాయసం

సొరకాయ 200 gm
పంచదార 150 gm
యాలకులు 4
జీడిపప్పు 5
కిస్‍మిస్ 5
బియ్యపు పిండి 1 tbsp
నెయ్యి 3 tsp
పాలు 1/2 lit

ముందుగా సొరకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
మందపాటి గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి
పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా వేపి
నీరు పోసి ఉడికించుకోవాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర వేసి
కరిగాక పాలు పోయాలి. బియ్యపు పిండిలో కొద్దిగా నీరు పోసి గరిటజారుగా
చేసి పాలు,సొరకాయ మిశ్రమంలో పోయాలి. కొద్దిగా ఉడికిన తర్వాత
దించేముందు జీడిపప్పు,కిస్మిస్,యాలకులపొడి వేసి దించాలి. దీనిని వేడి
వేడిగా లేకా చల్ల చల్లగా ఎలా తాగినా రుచిగానే ఉంటుంది.

ఎగ్ డ్రాప్ సూపు


బీన్స్,క్యాబేజీ,క్యారట్,కాప్సికం,బటానీలు 1 కప్పు
మిరియాలపొడి 1 tsp
ఉప్పు తగినంత
అజినొమొటో చిటికెడు
సొయాసాస్ 1/4 tsp
గ్రుడ్లు 2
కార్న్ ఫ్లోర్ 1 tbsp

ముందుగా కూరగాయలను చాల చిన్న ముక్కలుగా తరిగి మూడుగ్లాసుల నీరు పోసి ఉడికించాలి. తర్వాత మిరియాలపొడి,ఉప్పు,సొయాసాస్,అజినొమొటో కలపాలి.పావుకప్పు నీళ్ళలో కార్న్ ఫ్లోర్ను కలిపి అందులో పోసి వెంటనే కలపాలి ఉండలు
కట్టకుండా. ఇప్పుడు గ్రుడ్లను ఒక గిన్నెలో గిలక్కొట్టి మెల్లిగా మరుగుతున్న సూపులో పోసి మెల్లిగా గరిటతో కలపాలి అప్పుడు గ్రుడ్డు మిశ్రమం దారాల్లాగా వస్తుంది. ఒక నిమిషం మరిగించి దింపేయాలి.

సగ్గుబియ్యం ఇడ్లీ

సగ్గుబియ్యం 2 కప్పులు
పుల్లని మజ్జిగ 2 కప్పులు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి4
ఉప్పు తగినంత
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/2 tsp
సెనగపప్పు 1/2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 2 tbsp

సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఆరు గంటలు నానబెట్టాలి (మజ్జిగ మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి). ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టి అందులో నాంబెట్టిన సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమిర సన్నగా తరిగి ఈ మిశ్రమమలో కలపాలి. ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీల మాదిరిగా వేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. మెత్తగా ఉండే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలను టోమాటో చట్నీ కాని కొబ్బరి చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి.

కంది పచ్చడి


కందిపప్పు - 100 gms
ఎండుమిరపకాయలు - 6
జీలకర్ర - 1tsp
ధనియాలు - 1 tsp
నెయ్యి - 1 tsp
నూనె - tbsp
కరివేపాకు - 1రెబ్బ
చింతపండు - నిమ్మకాయంత

ముందుగా నెయ్యి వేడి చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టి, ఆ తరవాత కంది పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించి మిగతా వస్తువులతో కలిపి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నెలలు చల్లుకుంటూ ముద్దగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చడిలో కలపాలి. ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది

ఉల్లిపాయ కచోరి


కావలసిన పదార్ధాలు:
బంగాళదుంపలు - 2
ఉల్లిపాయలు - 2
సన్నగా తరిగిన అల్లం - 1 tsp
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1/2 tsp
పచ్చిమిరపకాయ ముక్కలు - 1 tsp
పచ్చి బఠానీలు - 1 tbsp
ధనియాలు - 1/2 tsp
నిమ్మరసం - 2 tsp
కారం పొడి - 1/2 tsp
గరం మసాలా పొడి - 1 tsp
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన కొత్తిమిర 1 tsp
కిస్‌మిస్ - 10
జీడిపప్పులు - 8
గోధుమపిండి - 250 gm
ఉప్పు - చిటికెడు
నెయ్యి లేదా నూనె - 2 tbsp
వంట సోడా - చిటికెడు

బంగాలదుంపలను మెత్తగా ఉడికించి , చేత్తో చిదిమి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, ధనియాలు, నిమ్మరసం, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమిర, కిస్‌మిస్, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి.పిండి లో ఉప్పు, వంటసోడా లేదా బేకింగ్ పౌడర్,నెయ్యి వేసి కలిపి తగినంత నీరు పోస్తూ చపాతీ పిండిలా కలిపి తడిగుడ్డ కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని కొద్దిగా నొక్కుకుని బంగాళా దుంపల మిశ్రమం ఉంచి అంచులను బాగా మూసేయాలి. దానిని కాస్త వెడల్పుగా చేసుకుని సన్నని సెగపై వేడి నూనేలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

గుమ్మడికాయ హల్వా


తురిమిన గుమ్మడికాయ - 500 gms
చక్కర - 200 gms
నెయ్యి - 50 gms
కోవా - 50 gms
యాలకుల పొడి - 1 tsp
ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా - 1/4 కప్పు
పిస్తా రంగు.. చిటికెడు

ముందుగా గుమ్మడికాయ కడిగి చెక్కు తీసి, సన్నగా తురిమి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఈ తురుము తడి ఆరిపోయేదాకా వేయించాలి. ఇపుడు చక్కర వేసి మళ్ళీ ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక కోవా, పిస్తా రంగు, యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి బయటకు వచ్చేదాకా వేయించాలి. ఇపుడు సన్నగా తరిగిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వేసి దింపేయాలి.

బిస్కట్లు


మైదా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
చక్కర - 1/2 కప్పు
నెయ్యి - 2-3 tsp

ముందుగా రవ్వ, మైదా, నెయ్యి వేసి బాగా కలపాలి. తగుమాత్రం నీళ్ళలో చక్కెరను కరిగించి ఆ నీళ్ళతో ఈ మిస్రమాని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు నానినతర్వాట బాగా మర్దన చేసి , చపాతీలా వత్తుకుని, చిన్న మూతతో బిళ్లలుగా కోసి నేతిలో లేదా నూనెలో గోదుమవర్ణం వచ్చేవరకు నిదానంగా వేయించుకోవాలి. ఇవి రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. తీపి వద్దు అనుకుంటే ఉప్పు, కారం వేసి కూడా చేసుకోవచ్చు.

బంగాలదుంప కట్లెట్


బంగాలదుంపలు - 1/2 kg
బ్రెడ్ స్లైసెస్ - 4
జీలకర్ర - 1/2 tsp
పసుపు - చిటికెడు
కారం - 1 tsp
గరం మసాలా - 1 tsp
సన్నగా తరిగిన కొత్తిమిర - 3 tbsp
ఉప్పు - తగినంత
వేయించడానికి నూనె

బంగాలదుంపలు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి. అది చల్లారాక మెత్తగా పొడిలా చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, కొత్తిమిర, గరంమసాలా, జీలకర్ర, నీళ్ళలో నానబెట్టి తీసిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వెడల్పుగా వత్తుకుని నాన్ స్టిక్ పై నిదానంగా , కొద్దిపాటి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా అయ్యేలా వేయించాలి. ఇది వేడిగా సాస్ తో వడ్డించండి..